నేలమ్మకు వందనాలమ్మ
కన్న తల్లికి మంగళారతులమ్మ
భూమి తల్లికి అభిషేకాలమ్మ
మట్టి తల్లికి మల్లె పూదండ లమ్మా
మనిషినైనా, మానునైనా పుట్టించే అమ్మ
చిరుతకైనా చీమకైనా అన్నం పెట్టేది అమ్మ
గాలి వెలుతురు నీరు ఇచ్చి ప్రాణం పోసేది అమ్మ
జీవించడానికి కావలసిన పదార్థాలు ఇచ్చేది అమ్మ
కొడుకులు అమ్మ సేవలన్నీ పొంది,
చివరకు వృద్ధాశ్రమాిల్లో వదిలేసినట్లు
నేలమ్మా పురుట్లో పుట్టిన వాళ్లంతా
ప్లాస్టిక్ కవర్లు వేసి ఊపిరి తీస్తున్నారు.
రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దినట్లు
ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు
అవసరం తీరాక మర్చి పోయినట్లు
నేల తల్లిని మరచి ఆకాశానికి ఎగురుతున్న రు
మల మూత్రాలలో పుడతాడు
మట్టిలో ఆడుకుంటూ పెరుగుతాడు
మట్టిలోనే చివరికి కలవాలని తెలుసు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి