పసిడి వృక్షము ;-ఎం. వి. ఉమాదేవి

ఆట వెలదులు 
=============
పసిడివృక్షమున్న పట్టరానిదియాశ 
కొమ్మకొమ్మ లెక్క కొసరుగాను 
నింక కొన్నియున్న నెంతబా గుండునో 
యనుచునొచ్చుకొంద్రు నవనిజనులు !

కంటినిండ నిదుర కడుపుకు తిండియున్ 
మానివేసి కాయు మానునెపుడు 
నెవరు దోచుకొనునొ నెవరినమ్మవలెను 
నన్నయూహతోడ నలమటించు !!

కామెంట్‌లు