మనం!!?;--ప్రతాప్ కౌటిళ్యా
నేను -నీటిని
ప్రేమించాను
తాగాను-నాలో కలుపుకున్నానూ
అనుభవించాను
అనుభూతి చెందాను
జీవించాను!! అది ప్రేమంటే!!!!

నేను-గాలితో
స్నేహం చేశాను
శ్వాసించాను-నాలో కలుపుకున్నాను
అనుభవించాను
అనుభూతి చెందాను
జీవించాను-అది స్నేహమంటే!!!!?

నేను-అన్నాన్ని
పొందాను-
తిన్నాను-నాలో కలుపుకున్నాను
అనుభవించాను
అనుభూతి చెందాను
జీవించాను-అది కీర్తి అంటే!!!?

ప్రేమ స్నేహం కీర్తి
లేకుండా మనం లేము!!?
ప్రేమ స్నేహం కీర్తి 
అంటేనే మనం!!!!?

ప్రేమతో శ్రీహరికి

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist.

కామెంట్‌లు