ఆయన పేరు అలోక్ సాగర్. ఆయన ఒకప్పుడు ఐఐటీ ప్రొఫెసర్. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కి పాఠాలు చెప్పినవారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని గిరిజనులతో కలిసి పనిచేస్తున్నారు. కొన్నేళ్ళుగా సాగర్ కొచ్చాములో నివసిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కానీ సరైన రహదారులు కానీ లేని ప్రదేశమది. బెతుల్ జిల్లాలో యాభై వేలకుపైగా మొక్కలు నాటిన వ్యక్తి.
అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైనవాళ్ళలో కొందరు పేదలభ్యున్నతికోసం ఎలా కృషి చేస్తున్నారో చదివే ఉంటాం. అయితే అతితక్కువ మందే పేదల మధ్యే నివసిస్తూ వారి సంక్షేమంకోసం అంకితమవుతుంటారు. అటువంటి మేటి వ్యక్తులలో అలోక్ సాగర్ ఒకరు.
1982లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి గిరిజనుల సేవకు అంకితమ్యారు. మహిళల అభ్యున్నతికీ, ప్రకృతితో అనుసంధానం అవడానికి పని చేస్తున్నారు.
టెక్సాస్ లోని ఓ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన అలోక్ గిరిజనుల మధ్య ఉంటూ మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యం గురించి వారికి వివరిస్తున్నారు.
అలోక్ సాగర్ గురించి శ్రామిక్ ఆదివాసీ సంఘటన్ ప్రతినిధి అనురాగ్ మోదీ మాట్లాడుతూ ఆయన అత్యంత నిరాడంబర మనిషని, కేవలం మాటలకే పరిమితం కాకుండా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప మనిషని ప్రశంసించారు.
మంచి మనుషులకే కష్టాలెదురవు తుంటాయన్నట్లు ఈయన వ్యవహారశైలినీ అనుమానించినవారు లేకపోలేదు. బెతుల్ లోని స్థానిక అధికారవర్గాలు ఆయనను పల్లె నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అయితే ఆయన పోలీసులను కలిసి తన ఆశయాలను విడమరిచి చెప్పరు. అయితే ఇప్పటివరకూ ఆయన నేపథ్యం గురించి స్థానికులెవరికీ తెలీదు. ఆయన కుటుంబం గురించి ఒకటీ అరా విషయాలు మాత్రం బయటికొచ్చాయి. ఆయన తండ్రి ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన లేరిప్పుడు. తల్లి డిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా హౌస్ లో ఫిజిక్స్ టీచర్ గా ఉండేవారు ఆయన సోదరుడు ఐఐటీ (డిల్లీ)లో ప్రొఫెసర్.
స్థానికుల జీవనవిధానాన్నీ వారి వేషభాషలనూ క్షుణ్ణంగా తెలుసుకున్న అలోక్ సాగర్ కి ఏడెనిమిది భాషలు తెలుసు. మొదట్లో ఆయనను అనుమానిస్తూ వచ్చిన స్థానికులు క్రమంగా ఆయనపట్ల నమ్మకం పెంచుకున్నారు.
నిజానికి నగరవాసులకంటే పల్లె ప్రజలే ప్రకృతికి దగ్గరగా నివసిస్తున్నారన్నది ఆయన మాట. ఆయన దాదాపు అరవై కిలోమీటర్ల మేరకు చొక్కా వేసుకోకుండా సైకిల్ మీద ప్రయాణిస్తూ పల్లె ప్రజలకు విత్తనాలిచ్చి మొక్కల పెంపకంవల్ల కలిగే లాభాలను వివరిస్తూ ఉంటారు.
ఓ ఆశయం కోసం కృషి చేస్తున్నప్పుడు అందుకెలా అంకితం కావాలనేదానికి అలోక్ సాగర్ జీవితగమనమే ఓ ఆదర్శం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి