పాపజాతి;-కిలపర్తి దాలినాయుడు
//సీసము//
వల్మీకమున దాగివసియింతునంటివా
పాలతోనినుజంపియీలవేయు!
పడగ సంపదతోడపయినంతునంటివా
దుడ్డు గర్రను దీసినడ్డివిరచు!
విసమున్నదనికాస్తబుసకొడుదునంటివా
పసదీసి యమ్ముచువిసరవైచు!
కైలాస నాధుని
కంకణంబంటివా!
కైలాసవాసమే కడకు నీకు!
తే.గీ.
తక్ష,వాసుకి,కర్కోట తనయవైన
భయము లేదింక మాకంటపడినవేళ
పాపజాతిని మించిన పాప జాతి
 మాసహనివాసులనుజంపుమానవులము!
----------------------------------------
నాగులచవితి శుభాకాంక్షలు లతో…

కామెంట్‌లు