సున్నితం ద్వీతీయ వార్షికోత్సవ వేడుకలు-.కె. శైలజా శ్రీనివాస్
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ........సున్నితం
రూపకర్త......నెల్లుట్ల సునీత గారు
=========================
సులభమైన చక్కని ప్రక్రియ
సున్నితమైన సున్నితాల  ప్రక్రియ
ప్రసన్నుత హృదయాల లయ 
చూడ చక్కని తెలుగు సున్నితంబు

సుమధుర భాష తెలుగు
సుమనస్కృతుల  భావంపు వెలుగు
సునీత మానసప్రక్రియ జిలుగు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

అలతిఅలతి పదాల మాలిక
అత్యంత నూతన కానుక
అందరికది అమృత గుళిక
చూడ చక్కని తెలుగు సున్నితంబు

ప్రతి అంశం నవీనం
పద ప్రయోగం వినూత్నం 
వెల్లివిరిసేను సున్నితం నిత్యనూతనం 
చూడ చక్కని తెలుగు సున్నితంబు

మాతృభాష  సతతం  హితం 
సుకృతం సునీతమ్మ సున్నితం
సమీక్షలు సుమధుర భరితం 
చూడ చక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు