తిశ్రగతి;- గజల్ ;- చంద్రకళ యలమర్తి
కాఫియాలు :
 లాభమెలా,యుద్ధమెలా, భవితనెలాఊహనెలా,
పూత నెలా, వెలుగునెలా


*****

దారుణ మారణ కాండల
లాభమెలా పొందగలము 
మతి తప్పిన మనిషి చేయు
యుద్ధమెలా ఆపగలము 

మాటలలో విషం చిమ్మ
 జీవితమే భారమౌను 
మారలేని మూర్ఖత్వపు 
ఊహనెలా మార్చగలము 

 భీకరపోరాటములో
పాపలకూ రక్షణలేదు 
 హృదయాలే  ఛిద్రమయిన 
 భవిత నెలా ఇవ్వగలము 

ఉన్మాదపు పగలతోను 
వూరువల్ల కాడాయెను 
 కాలి కూలిపోయిన ఆ                                          
ఇళ్ళ నెలా కట్టగలము 

 మరణాన్నే బహుమతిస్తె        
మిగిలేదీ విషాదము                    
అమావాస్య చీకటిలో
వెలుగునెలా చూడగలము
***


కామెంట్‌లు