సుప్రభాత కవిత ; -బృంద
ఎన్ని కోరికలో
ఎన్ని కలలో
ఎద నిండా.....

కరుగుతున్న కాలం కడలిలో
సాగుతున్న  నావలు

ఒడిదుడుకులకు
వెరవకుండా
ఒడ్డు చేరుకోవాలని

ఓటములెన్ని ఎదురైనా
గెలిచి తీరాలని

చీకట్లెన్ని ముసిరినా
ధైర్యం  చెదరనివ్వని

స్వప్నాలు సాకారమవకున్నా
సత్యాలను స్వీకరిస్తూ..

కొత్త ఆశలకు నీరుపోస్తూ
మొక్కవోని పట్టుదలతో

ముళ్ళు పక్కకు తోస్తూ
ముందడుగు వేస్తూ

అడుగడుగునా  ఆత్మబలంతో
దీపమూ వెలుగూ 
తానే అయి సాగే 
జీవిత గమనంలో

మరొక  మంచి అవకాశమిచ్చిన
అరుదైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు