అపేక్ష... ఉపేక్ష
******
దేనిని అపేక్షించాలి దేనిని ఉపేక్షించాలి అనే నిర్ణాయక శక్తి వ్యక్తి యొక్క ప్రవృత్తి, విజ్ఞత, వివేకం మీద ఆధారపడి ఉంటుంది.
అపేక్ష అంటే కోరిక లేదా వాంఛ/ఇచ్ఛ /దృష్టి అని కూడా అంటారు.
అనవసరమైన వాటిని కోరుకోవడం, హద్దులు దాటి వాటిపైన దృష్టి పెట్టడం,విలాసాల మీద అపేక్ష పెంచుకోవడం వల్ల తీవ్రమైన మానసికంగా ఒత్తిడికి, అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు వస్తాయి.
అపేక్ష ఎంత అధిక స్థాయిలో ఉంటే ఆవేదన కూడా అదే స్థాయిలో ఉంటుంది.
విద్యా, విజ్ఞానం మంచిపనులు చేయడంపై అపేక్ష పెంచుకుంటే ఆనందం పెరుగుతుంది.మానసిక తృప్తి కలుగుతుంది.
ఇక ఉపేక్ష అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఉదాసీనత, విడుచుట.
కొన్ని విషయాలు,పనుల పట్ల ఉపేక్ష తగదు.
అలా ఉపేక్షించడం వల్ల చాలా నష్టపోవడం, జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకోవడం జరుగుతుంది.
అపేక్ష, ఉపేక్షల విషయంలో తల్లిదండ్రుల,హితైషుల సలహాలు ,సూచనలు పాటిస్తే మంచిది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి