సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 అనర్ఘము...అనర్థము
     *****
 జీవితం అనర్ఘము అని సదా గుర్తుంచుకోవాలి.. అలాంటి జీవితానికి ఎప్పుడూ అనర్థము చేయకూడదు.
అనర్ఘము అంటే అమూల్యమైనదని, ఎక్కువ వెలగలదని అర్థం.
ఎంతో విలువైన జీవితంలో సమయం కూడా అంతే విలువైనదని గమనంలో ఉంచుకోవాలి.చేజారినకాలం కానీ, జీవితం కానీ మళ్ళీ తిరిగి రావు.
వాటిని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి.
కొందరు అనర్థాలను కొని తెచ్చుకుంటారు.మరి కొందరు ఇతరులకు చెడుపు చేస్తుంటారు. హాని తలపెడుతుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
అపకారికైనా ఉపకారము చేయడమనేది మానవీయ లక్షణం.
అనర్థము అంటే ఏమిటో ఈపాటికి అర్థమై వుంటుంది.
అనర్థము అంటే,అనిష్టము, అపకారము,అపాయం,అభిద్రోహం,చెడుపు, చేటు,హాని, ద్రోహం, దోషము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
ఎవరికీ మనవల్ల ఎలాంటి అనర్థము జరగకుండా,అనర్ఘము అయిన జీవితాన్ని అనర్ఘ్యముగా( ఎక్కువ పూజింపదగినదిగా) మార్చుకుందాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు