సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుక; పి. దినకర్ రెడ్డి
 సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:: నెల్లుట్ల సునీతగారు
=========================
331
వారానికో చక్కని అంశం
ఇస్తుందో సాహితీ సమూహం
వ్రాయమంటుంది మనల్ని సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు 
332
మూడు పాదములు మీవి
నాలుగో పాదము తనదే
చూడచక్కగా చెప్పుకునే సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు
333
సామాజిక అంశాలతో అవగాహన
జీవన అంశాలతో మార్గదర్శనం
మంచి కోరే సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు
334
సున్నితంతో నాక్కూడా దొరికింది
తెలుగు బుక్ రికార్డుల్లో
ఒక మరపురాని స్థానం
చూడచక్కని తెలుగు సున్నితంబు
335
రచయితలకు ఇది ప్రోత్సాహం
తెలుగు వెలుగుల స్థావరం
మీరు మెచ్చే సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు