శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 బాలమ్ అనే శబ్దం బలేమన్ నించి వచ్చింది.హిందీ కవులు  భర్త  పతి అనే అర్ధం లో వాడారు.బాలమ్ నిజానికి  అరబిక్ పదం.ఫారసీ మాధ్యమం గా హిందీ లోకి వాడుకలోకి వచ్చింది. బ్రజ్ అవధీ బఘేలీ మొదలైన  భాషల జానపద గీతాల్లో భర్త అనే అర్ధం లో వాడారు. అసలు సిసలు అర్ధం "నాభర్త"అని.
బదమాష్ అనే పదాన్ని  తిట్టుగా వాడుతున్నారు. అల్లరి దుడుకు అనే అర్ధం లో వాడుతున్నారు. ఇది బద్+మ ఆష్ అనే ఫారశీ పదం.చె డు  జీవిక అని  అర్ధం! అంటే చెడుపనులతో తన పొట్ట పోసుకునే  వ్యక్తి ని  బద్మాష్ అనేవారు.
బిల్లౌర్ అనే పదం సంస్కృత వైఢూర్యం నించి వచ్చింది. ప్రాకృతం లోబెలురియ అని  హిందీ లో బిల్లౌర్ అంటే గాజులాగా స్వచ్ఛమైన పారదర్శకంగా ఉండే స్ఫటికం క్రిస్టల్🌷

కామెంట్‌లు