సుప్రభాత కవిత ; -బృంద
ఆగమిస్తున్న అరుణుడికి
మేఘమాలల కవాతు

జలతారు జిలుగుల్లో
వయ్యారాలుపోతున్న అలలు

అందమైన తలపులతో విరిసే
నగవుల్లా  మెరుపులు

పడచుపిల్ల నవ్వులా
పరవశం  నింపే కదలికలు

మదిలో మధురగీతి పల్లవించగా
ఆనందతీరం చేరుకునే  కలలు


మనసు దోచే ఉదయరాగం
నింపే ఉల్లాసమైన ఉత్సాహం

కొండల కోనల మెలికల్లో
కొత్త మెరుపులు నింపే వేకువ

నింగి నుదుటను సింధూరం
తూరుపు పాడిన భూపాలం

కంటికి నిండుగా తోచి
పండుగ తెచ్చే ఉదయం

తన కనుసన్నల్లో మసిలే
సమస్త జగతికి  శుభాలనిచ్చి

మనదనిపించే అపురూప
క్షణాలను అనుగ్రహించే

ఆప్తమిత్రుడికి అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు