కీటక సంవాదం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓరోజు  ఈగ గొప్పగా అంది" ఏయ్ దోమా! నేను ఎంచక్కా అన్ని రకాల స్వీట్స్ ఆహార పదార్థాలఫై వాలి కమ్మగా తిని బ్రేవ్ మంటాను.నీవు కేవలం ప్రాణుల మనుషుల రక్తం తాగుతావు.నేనే గొప్ప!" అందుకు దోమ అంది"జనం నిన్ను తేలిగ్గా చంపగలరు.చీపురు కట్ట తో మీగుంపుని చంపటం తేలిక! అందుకే నీవు  కన్పడటంలేదు.నేను మాత్రం  పగలు రాత్రి మనిషిని  కుట్టి కుట్టి ఏడిపిస్తాను.ఫ్యాన్ దోమతెర కొనే దోమనివారణ మందులన్నీ నాముందు బలాదూర్!"అవి వాదించుకుంటూ ఉండగా బొద్దింక  వచ్చింది. "మీకు ఓపరీక్ష పెడతాను.అక్కడ ఉన్న  ఎద్దు కొమ్ముపై వాలండి."అవి అలాగే చాలా సేపు కూచున్నా ఎద్దు కదలలేదు.అప్పుడు బొద్దింక అంది"మీరిద్దరూ  ఎందుకూ పనికిరాని వారే! ఆఎద్దు కించిత్ కూడా కదలక మెదలక ఉంది. ఎందుకు అంటే దాని కొమ్మలకి మీస్పర్శ తగలదు. మీరు వాలే ప్రాంతం నిబట్టి  మీబండారం ప్రతాపం పనిచేస్తాయి. మీరు దాని శరీరంలోని ఏభాగంపైనన్నా వాలండి"అవి పురిగొల్పింది.అంతే ఎద్దు శరీరంపై వాలగానే అది తోకతో ఒక్కసారి ఝాడించింది.అంతే వాటి రెక్కలు విరిగాయి.గర్వం  అహంకారం పనికిరాదు సుమా🌹
కామెంట్‌లు