సుప్రభాత కవిత ; -బృంద
తలపులఅలజడికి 
అలుపు లేదే
గుండెలో....

కెరటాలకు నీరసమే
రాదే.....సంద్రంలో

మజిలీలు  మారిన
మమతలన్నీ
మాయని జ్ఞాపకాలే!

గుండెకు పండుగ తెచ్చిన
సరదాలన్నీ గతాలే!

తలచుకుంటే సంతోషం
మళ్లీ  మరలి రావని
దుఃఖం  వెనువెంటే!

గతమైన సంబరాలు
నిత్యమూ  రావాలని

మనసు ముంగిట
ఉత్సాహం  తుళ్ళిపడాలని

రెప్పల తలుపులు మూసిన
కనులు కనే కలలు

కుప్పలు తెప్పలై
కంటికి విందులు చేయగ

పెదవుల విరిసే నవ్వులు
ఎప్పటికీ  నిలిచి పోయేలా

మురిపాల ముత్యాలు
మూటగా తెచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు