నాకు పంచభక్ష్యాలు
ఇవ్వవలసినపనిలేదు
బ్రతకటానికి
తిండినిస్తేచాలు భవాని
నాకు ఆస్తిపాస్తులు
అవసరములేదు
ఉండటానికి చిన్నపొదరింటిని
ఇస్తేచాలు కాత్యాయణి
నాకు అప్సరసలాంటి
భార్యతోపనిలేదు
మంచిమనసును
సదాసతికిస్తేచాలు పార్వతి
నాకు అందచందాలు
ఇవ్వమనికోరను
ఆరోగ్యమిస్తేచాలు
ఆనందపడతా రాజరాజేశ్వరి
నాకు తమదర్శనము
ఇవ్వవలసినపనిలేదు
నాపై నాకుటుంబముపై
కరుణకటాక్షాలు కురిపిస్తేచాలు గౌరి
నేను భోగభాగ్యాలు
కోరుకోవటంలేదు
లోకసమస్తమును
సుఖముగానుంచితేచాలు చండి
నాకు శక్తియుక్తులు
పనిలేదు
తమను పూజించే
భక్తినిస్తేచాలు మహేశ్వరి
నాకు తెలివితేటలు
అవసరమేలేదు
తమను మరవకుండా
గుర్తుంచుకొనేలాచేస్తేచాలు విశాలాక్షి
నాకు పనిపాటలు
సమకూర్చేపనిలేదు
తమను కొలిచే
అవకాశమిస్తేచాలు శాంభవి
నాకు స్వర్గసుఖాలు
ఆవశ్యకముకాదు
తమనుసేవచేసే
అదృష్టమిస్తేచాలు సింహవాహిని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి