దారి దీపం:--- దోర్బల బాలశేఖరశర్మ


 పెద్దలు, అనుభవజ్ఞులు చెప్పిన మంచి మాటలు చాలామంది వినరు. నిజానికి వాటిని విని, పాటించాలని వారికి ఎంతమాత్రం అనిపించదు కూడా. 'అప్పుడు విని వుంటే బావుండేది కదా' అని తర్వాత అది అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. దీనినే 'భగవత్ నిర్ణయం' అంటారు. మన భావన, ఆలోచన, నిర్ణయం, ఆచరణల పరిధిలోకి రానివన్నీ దైవిక అంశాలుగా చలామణి అవుతాయి. అందుకే, బుద్ధి మాటలు ఎవరు చెప్పినా భగవంతుని ఆదేశంగా భావించి వినడం ఉత్తమం.


కామెంట్‌లు