బలం! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో ఇద్దరు పిల్లలు కుస్తీ పడుతున్నారు. మిగతా పిల్లలంతా పకపకా నవ్వుతున్నారు.టీచర్ వస్తూనే  ఇది గమనించి అంది" శారీరకబలం ముఖ్యమే! కానీ దాని కన్నా మానసిక బలం మరీముఖ్యం! నేడు మనిషి ఆయుధాలతో తమని చంపుతారు అని జంతువులు గ్రహించాయి.అందుకే మందలు మందలుగా కోతులు  ఏనుగులు దాడిచేసి పైరు పంటల్ని నాశనం చేస్తున్నాయి." టీచర్ తో పిల్లలు అన్నారు"వీధి కుక్కలు మామీదకి భొయ్ అని  అరుస్తూ వస్తున్నాయి.మొన్న నాకాలు పట్టు కుంది. " "జాగ్రత్తగా ఉండాలి. బజారు కుక్కలు దాడిచేస్తున్నాయి.మొన్న  మా పక్క ఇంటి పిన్నిగారిని కరిచాయి.పాపం! ఆమె చేయి విరిగింది.వెంటనే  హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి యాంటీ రేబీస్  ఇంజక్షన్ ఇప్పించాము.చేతికి ఆపరేషన్! ఇంకా ఆఇంజక్షన్ డాక్టర్ చెప్పిన  ప్రకారం తీసుకోవాలి.పూర్వం పిల్లలు బైట ఆడుకునేవారు.పెద్దలు కబుర్లు చెప్తూ అరుగుమీద కూచునేవారు.పిల్లలచేత వాటికి బిస్కెట్లు వేయించేవారు.కానీ నేడు వీధికుక్కల బెడద పెరిగింది. వెంటనే మున్సిపాలిటీ వారికి  చెప్పాలి.మనం అన్నిటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం.పక్కవాడిని పట్టించుకోము."టీచర్ మాటలతో పిల్లలు ఓనిర్ణయానికి వచ్చారు "మనం చేతిలో  రాళ్ళు  కర్రతో  కలిసి కట్టు గా వెళ్దితే కుక్కలు ఏమీ చేయవు.ఐనా వాటిని చూస్తూ వెళ్ళితే  మన వెంట పడతాయి"🌹
కామెంట్‌లు