చందమామ-- -రూప
 పగటోలె ఉండే పట్నంలో 

పట్టించుకోకున్నా నిండు జాబిలి వస్తాడు
వెలుగులు ఉన్నాయని
వెన్నెల కురిపించడం మానేస్తాడా
రాజనగరి మీదా మురికివాడ మీదా 
పండు వెన్నెల కాస్తాడు
కన్నులు దోచే పున్నమి చంద్రుని చూడ
రాజమహలులో తీరిక లేదు
మురికి వాడలో కోరిక లేదు
కామెంట్‌లు