నర్తనశాల (కైతికాలు )-ఎం. వి. ఉమాదేవి
నాట్యమాడు నిలయమదే 
నటరాజకి అర్పణమే 
సాధనలో తరించేది 
లలితకళాభి మానమే 
వారేవా నర్తన శాల 
కళామతల్లికి మల్లెలమాల !!

హస్తపాద ముద్రలతో 
అభినయమే అద్భుతమూ 
కూచిపూడి, భరతముని ల 
సృజనలతోడనే దివ్యము 
వారేవా నర్తనశాల 
లాలిత్య వ్యాయామహేల !!

తకథిణ తోమ్మని ఆడుచు  
నవరసములనే చూపును 
మనోరంజితము నాట్యము 
హృదయంలోనే నిలుచును 
వారేవా నర్తనశాల 
భారతీయ నాట్యలీల !!


కామెంట్‌లు