అనంతమైన ఆనందానికి
తృప్తే కారణం...
మరువలేని మమతలతో
మౌనంగా ....
మరపురాని అనుభూతులతో
ఆనందంగా
మరలిరాని ముచ్చటైన క్షణాలన్నీ
అపురూపంగా...
ఏది వస్తే అదే తనదని
ఆప్యాయంగా...
కొఱత లుంటే కదా కోరికలు
అన్న చందంగా
మనసులోని సంతోషం
మొహంలో
కళ్ళలోని ఆహ్లాదం
పెదవులపై విరిసేలా
బ్రతకగలిగితే
అవసరం అయిన వరం
వుంటుందా?
అపురూపం కాని
క్షణముంటుందా?...
రోజులన్ని మోజుగా
మారిపోయే మార్పునిచ్చే
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి