సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 భాషణము... భూషణము 
  *****
భాషణము అంటే మాట, వాణి,వచనము,భాషితము,వాక్కు ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
మరి భాషణం ఎలా ఉండాలి.సహృదయత, సంస్కారంతో తేనెలు జాలువారునట్లు ఎదుటివారి హృదయాన్ని గెలుచుకునేలా ఉండాలి.
భాషణంలో సత్యసంధత,నీతీ, నిజాయితీ కనిపించాలి.సందర్భానుసారంగా విజ్ఞత వివేకం ప్రస్ఫుటించాలి.మనసులోని భావాలను చక్కగా వ్యక్తీకరించే విధంగా ఉండాలి.
వ్యక్తికి భాషణాన్ని మించిన భూషణం మరొకటి లేదు.
భూషణమంటే ఆభరణము,అలంకారము.
ఇది వ్యక్తిత్వాన్ని శోభాయమానం చేసే అలంకారం.
ఇరివెంటి కృష్ణమూర్తి గారు వాగ్భూషణం భూషణం అనే చక్కటి వ్యాసం రాశారు.
 భాషణాన్ని భూషణంగా ధరించి వివిధ రంగాల్లో ఎలా రాణించవచ్చో ఇందులో వివరణాత్మకంగా చెప్పడం జరిగింది.
 కాబట్టి భాషణము సుభాషితంగా ఉండేలా చూసుకుందాం.
భూషణంగా ధరించి ఎదుటి వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు