అమ్మతనం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అమ్మ ప్రేమ కేవలం మనిషి లోనే కాదు పశుపక్ష్యాదులలో కూడా ఉంది. ఇది నిజంగా జరిగిన యదార్థగాథ! అమెరికాలో సియటెల్ నగరంలో రెండు చిన్న ఉడత పిల్లలు గూటిలోనించి 40అడుగుల ఎత్తు మీద నించి కింద పడిపోయాయి. కొద్ది రోజుల క్రితమే అవి పుట్టాయి.ఓపిల్ల చనిపోతే రెండోపిల్ల పాపం అలా గాయాలతో పడుంది.ఓ అమెరికన్ మహిళ ఆఉడుతపిల్లను తనస్నేహితురాలికి అప్పజెప్పింది
అప్పజెప్పింది. రోగాలబారిన పడిన  కింద పడి గాయాల తో బాధపడే జంతువులకి సేవ సంరక్షణ చేస్తుంది.అది ఆమె వృత్తి హాబీ!బ్లూక్రాస్ సొసైటీ హైదరాబాద్లో కూడా ఉంది. ఈఉడుత పిల్లకి తగిన  వైద్యం చేస్తున్న  ఆమె వద్ద  ఓఆడకుక్క ఉంది. అది గర్భం తో ఉంది. ఈచిన్న ఉడత పిల్లను ఆకుక్క తన దగ్గరికి తీసుకుని  పొట్టలో పొదువుకుని ప్రేమగా నాకసాగింది.దానికి బుజ్జి బుజ్జి పిల్లలు పుట్టాయి.కానీ ఆకుక్కతల్లి తన పిల్లల తోపాటు చిన్నారి ఉడుతకికూడా పాలు ఇచ్చింది. ఇలా రోజూ కుక్క పిల్లలతో పాటు పాలుతాగి బుడత ఉడుతపిల్ల బలంగా ఆరోగ్యం గా గెంతుతోంది.ఆసంరక్షకురాలు ఆఉడుతను మళ్లీ  దాని జాతితో కలపాలని  రోజూ గింజలు పళ్లముక్కలు ఆహారం గా తినిపించేది.ఇప్పుడు స్వయంగా ఉడత  ఉరుకులు పరుగులతో స్వేచ్ఛ గాతిరగటంతో  దాన్ని  చెట్టుపై ఉడతలున్న ప్రాంతం లో వదిలింది.2వారాల తర్వాత  ఆఉడుత ఇంకో  నలుగురు ఉడుత స్నేహితులను తీసుకుని ఆకుక్క అమ్మను చూట్టానికి వచ్చింది.రెండోసారి కూడా వచ్చింది ఆపాలిచ్చి పెంచిన తల్లిని  చూట్టానికి! ఇక బాగా పెద్దదైంది. అందుకే  తన ఉడత జాతితో కలిసి పోయి ఇంక రావటం మానేసింది. ఇలాంటి యదార్థగాథలు  చదివి నప్పుడు మనిషి  ఎంతహీనంగా తయారైనాడో తెలుస్తోంది. నేడు  చెత్త కుప్పల్లో ముళ్లపొదల్లో కనిపడేసే మహాతల్లులు మనదేశంలో  మనరాష్ట్రంలో తయారైనారు.అందులో చదువు సంధ్యలున్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఉన్నారు అని ఓపరిశోధనలో తేలింది. ఇవి పేపరు లో చదివితే ఏమనిపిస్తుంది? పశుపక్ష్యాదుల కన్నా హీనం!తల్లి ప్రేమకి అర్ధం పరమార్ధం పోయింది కదూ?🌹
కామెంట్‌లు