తపాలా శాఖ (సమ్మోహనం )--ఎం. వి. ఉమాదేవి బాసర.
ఉత్తరాలవి నాడు 
నాడు నడిచే చూడు 
చూడగా ప్రతిరోజు పోస్టుగా ఓ వనజ !h

ఎర్ర డబ్బా లోను 
లోన ఒదిగే తాను 
తానుగా సమాచార మందగ ఓ వనజ !

ఎదురు చూపులు చూచి 
చూసి జాబును దాచి 
దాచుకొని చదివేను నవవధువు ఓ వనజ!

పోస్టులో పింఛనులు 
పింఛనుకిక వృద్ధులు వృద్ధులే వేచేరు ఆశతో ఓ వనజ !

నిరుద్యోగుల కబురు 
కబురు గంతేసేరు 
గంతేసి ఉద్యోగమున చేరు ఓ వనజ !!

పెళ్లిపిలుపుల కార్డు 
కార్డులోన రికార్డు 
రికార్డుగ కమ్మికే గుచ్చేరు ఓ వనజ !


కామెంట్‌లు