భావిపౌరులు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 బాలలు బాలలు
ఒడిలో పూవులు
బాలల మాటలు
తేనెల ఊటలు
బాలల ఆటలు
వెన్నెల వాకలు
బాలల పాటలు
కోకిల పాటలు
బాలల నవ్వులు
చిరుచిరు మువ్వలు
బాలల నడకలు
హంసల నడకలు
బాలల పరుగులు
సంద్రపు నురుగులు
బాలల అందం
జాబిలి చందం
బాలల భాష
అమ్మ భాష
బాలల ప్రేమ
అనంత ప్రేమ
బాలలు బాలలు
భావి పౌరులు !!

కామెంట్‌లు