@ ఊహించగలమా...... !(బాల గేయం :- )కోరాడ నరసింహా రావు !
వాడు... నాన్న ఆశా కిరణం !
 వీడు,అమ్మ మురిపెపుతనివి!! 
    అల్లరిలో... వీరిరువురూ.... 
  ఎవరికెవరూ  తీసిపోరు... !

బర్లవారి ఇంటి బంగారు... 
  మొలకలే  వీరు... !
 తియ - తీయని పలుకుల... 
  రామచిలుకలు... !!

ఒకపరి..రామ-లక్ష్మణులే వీరు!
ఇంకొకపరి వాలి - సుగ్రీవులే... 
 ఐపోతారు.... !

అరవైదాటిన తాతకు లేని 
   తెలివి తేటలు..., 
 ఆరేళ్ళు దాటని వీళ్ళలో... 
  ఏమిటీ  విచిత్రం.. !?

సెల్ ఫోనుల్లో యాప్ లైనా ... 
  T. V. రిమోట్ బటన్లయినా... 
  అవలీలగ వాడే చాతుర్యం... 
 ఇది నమ్మాల్సిన నిజం... !

తరాలలో  అంతరాలకు.... 
 ప్రత్యక్ష ప్రతీకలు వీరు... !
  కాలం తో... పోటీ పడుతూ... 
  పరుగులనే  తీయగలరు !!

 నిన్నటికీ -  నేటికి... ఇంత 
  తేడాయే కనిపిస్తుంటే..., 
 రేపటి తరాన్ని మనము... 
   ఊహించుట సాధ్యమౌనా ?!
.   *******

కామెంట్‌లు