రైతన్న బాల గేయం;-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
రైతన్న నీ ఒంటిలో రక్తమంతా
చెమట చుక్కలు గా మార్చి 
 ఒళ్ళు మీది కండలన్నీ కరిగేలా
కాయ కష్టం చేస్తావు రైతన్న !!

వృశ్చికాలతో పలుకుతూ
జానపదలు పాడుతూ
దుఃఖినంత దున్నుతావు
విత్తనాలు చల్లుతావు రైతన్న !!

పచ్చగా పైరులు ఎదగంగా
కలుపు మొక్కలు పెకిలిస్తావు
కంపోస్ట్ ఎరువులు చల్లేసీ 
పంటలన్నీ పండిస్తావు రైతన్న !!

దేశ ప్రజల ఆకలి తీర్చే
అన్నదాతవు నీవే రైతన్న
పాడిపంటలతో దండిగా
దేశాన్ని మురిపిస్తావు రైతన్న !!


కామెంట్‌లు