బతుకమ్మ పండుగ;-ధరావత్ అశ్విని-ఏడో తరగతి-జి. ప. ఉ. పా. మాల్తుమ్మెద-కామారెడ్డి
 పల్లెంలో గుమ్మడాకులు వేసి
గునుగు,తంగేడులతో
రంగురంగుల తీరైన పూలతో
బతుకమ్మను తయారుచేసి
పసుపుముద్దతో గౌరమ్మనుచేసి
ఆడపడచులంతా
అందంగా ముస్తాబై
అందరూ ఒకచోట కలిసి
బతుకమ్మ ఆటలు ఆడుతూ
పాటలు పాడుతూ
తొమ్మిది రోజులు సంబురంగా
ఆనందంతో గడుపుతారు
బతుకమ్మను నీటిలో వదిలి
పోయిరామాతల్లి పోయిరావమ్మా
వచ్చే యేడు మళ్ళీ రావమ్మా అంటూ
బతుకమ్మలను సాగనంపుతారు.

కామెంట్‌లు