సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుక; -అద్దంకి లక్ష్మీ -ముంబై
 సాహితీ బృందావన జాతీయ వేడుక
 ప్రక్రియ సున్నితం
 రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
========================
226
సున్నితాల ద్వితీయ వార్షికోత్సవము     దిగ్విజయంగా జరుపు ప్రయత్నము 
కవుల సంఘటిత మనోభిలాషము
 చూడచక్కని తెలుగు సున్నితంబు
227
సాహితీ బృందావన నందనవనము
 సాహిత్య పరిమళాలకు నిలయము
 సప్తవర్ణ సింగారాల ఆభరణము
 చూడచక్కని తెలుగు సున్నితంబు
228
ముచ్చటై మూడుపదాల విధానము
మాత్రాచందస్సుకు కూడా సంబంధము
 మనసులను ఆకట్టుకునే విధానము
 చూడచక్కని తెలుగు సున్నితంబు
229
నూతన అంశముల ప్రకాశము
 మేధస్సును పెంచే విజ్ఞానము
కొత్త అంశమునకు    ఉత్సాహము
 చూడచక్కని తెలుగు సున్నితంబు
230
 తెలుగుభాషలో కొత్త ప్రయోగము
సున్నితమ్మ ఎదపొంగిన కెరటము
సమూహమున నుండే సన్నిహితము
 చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు