విజయదశమి శుభాకాంక్షలతో విజయాలు కలగాలని కోరుకుంటూ...
============================================
నమించు...నమ్మించు
*****
నమించు,నమ్మించు ఈ రెండు పదాల మధ్య ఓ చిన్న వ్యత్యాసం పూర్తి అర్థాన్నే మారుస్తుంది.
నమించు అంటే నమస్కరించు,పూజించు అని అర్థం.నమించు పదంలో సభ్యత సంస్కారం ఉన్నాయి.
తల్లిదండ్రులను,పెద్దలను, గురువులను గౌరవించే, పూజించే మహోన్నత సంస్కృతి సాంప్రదాయం మనది.
అలా నమించుటలోనే వ్యక్తి యొక్క వినయం, విధేయత, నమ్రతతో కూడిన ప్రవర్తన గోచరమవుతుంది.
పెద్ద వాళ్ళతో ఎలా మెలగాలో, వారిని ఎలా గౌరవించాలో, వారు ఎదుట పడినప్పుడు ఎలా ఉండాలో చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పాలి.
నమ్మించు అనే పదానికి అర్థం నమ్మకాన్ని కలిగించుట, విశ్వాసాన్ని పుట్టించుట.
మన మాటలు,చేతలు,ప్రవర్తనేఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకం, విశ్వాసం కలిగేలా చేస్తాయి.
ఒక్కసారి నమ్మకాన్ని వమ్ము చేశామా...ఇక ఆ తర్వాత ఎంత నమ్మించాలని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదుటి వారి మనసులో పూర్వపు స్థానాన్ని పొందలేం.అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
శుభోదయ నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి