జయంత్!!;- ప్రతాప్ కౌటిళ్యా
అమ్మ చూపిన చందమామ
బువ్వ ముద్దై
వెండి పళ్లెంలో మెరుస్తుంది!!

ఆకాశంలో అటూ ఇటూ 
ఆడుకుంటూ
ఏటిలో పడి కొట్టుకుపోతుంటే

కొంగులో ముడివేసి
నా నుదుట బొట్టును చేసి దిద్దింది
నా నాలుకపై పలకను చేసి
అక్షరాభ్యాసం చేసింది!!

నాతో స్నేహం చేసిన తొలి మిత్రుడు
మచ్చలేని చంద్రుడు
అతడే జయంతుడు!!!?

పచ్చని అడవిలో ఆడుకుంటుంటే
ఏనుగు గీంకరించింది
చిరుత వేటాడింది
పులి పొలికేక వేసింది!!

అడివి అంతా
లేళ్ళు కుందేళ్లు
భయపడి పరిగెత్తుతుంటే

కోకిలను చూపించి
చిలుకను పరిచయం చేసి
నెమలిని పలకరించి
పర్వాలేదు ఇవి పరిగెత్తగలవు
కానీ పరిగెత్తవు

అడవిని పాలించిన
సింహానికి ఇవి భయపడవు
అడవి పై నీ తొలి విజయం ఇదే
అని చెప్పిన నా మిత్రుడు
అతడే నా జయంతుడు!!!

నీరు పేరు ఒకటే
ఆగితే ఏరు అవుతావు
పారితే నది అవుతావు
పైనుంచి దుమ్కితే
జలపాతాం  అవుతావు!! కురిస్తే ఆకాశమేగానివి అవుతావు!!

ఎదగాలని ఉంటే
ఒదిగి ఉండటమే కాదు
నీరులా నీవు మారాలి
నీరులా నీవు బదులు ఇవ్వాలి
కొండ కోనల్లో నీ పేరు మారు మోగాలి!!

అని చెప్పిన తొలిపేరే
జయంత్ కుమార్ రెడ్డి!!

రంగురంగుల పూల తోటల్లో
గండు తుమ్మెదలే కాదు
సీతాకోచిలుకలు ఉంటాయి!!
పండ్ల తోటల్లో
రామచిలుకలు ఉంటాయి!!!?

రంగురంగుల ఈ లోకంలో
తోటమాలివి కాదు
బాటసారి వి కావాలి!!?

బాటలు నిర్మించాలి
వేటను నిర్మూలించాలి

గంధర్వులు పాడే పాట కాదు
గాంధారిలా చూపులు ఆపే
గుణపాఠం కావాలి!!!
అని తొలి పాఠం చెప్పిన
ఆత్మీయ మిత్రుడు జయంత్ కుమార్ రెడ్డి!!

కాలాన్ని జయించినది
పొలాన్ని జయించినది
రైతు బిడ్డ ఒక్కడే!!

కాలాన్ని జయించిన
మన మున్సిపల్ కమిషనర్
జయంత్ విజయవంతం అవ్వాలి!!!
================================================
నా మిత్రుడు జయంత్ కుమార్ రెడ్డిని నాగర్ కర్నూల్ కు ఆహ్వానిస్తూ
===============================================

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు