సుప్రభాత కవిత ; -బృంద
కదిలిపోయే....మబ్బులన్నీ
నిలిచి చూసే ముచ్చట

రంగులీను అందాలు
పోంగిపోతూ అచ్చట


మిన్నంతా సంతోషం
అంబరమంతా  సంబరం

నింగిలోని నీలానికి
రంగులొచ్చి  మెరిసేను

తూరుపంత వెలుగులో
తడిసి మురిసిపోయేను

నేలపైని....నీటి మదిలో
నింగిలోని  మబ్బుల  రూపాలు

పదిలమైన జ్ఞాపకాలు
ఎప్పటికీ నిత్యనూతనాలు

రెప్ప వేస్తే మాసిపోవునని
మనసంతా దాచిన వైనాలు

నింగికీ నేలకీ
నీటికీ మబ్బుకీ
తూరుపుకూ వెలుగుకూ
ఎన్నడు వీడని బంధం

మనసుకూ తలపులకూ
కనులకూ  కలలకూ
విడదీయలేని బంధం

మనోహరమైన...మధురమైన
ఇగిరిపోని పరిమళం 
తెచ్చే  ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు