సున్నితంద్వితీయవార్షికోత్సవ వేడుకలు -వి .విజయశ్రీదుర్గ

 సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:: శ్రీమతి నెల్లుట్ల సునీతగారు
==========================
51
సున్నితము ప్రక్రియ సున్నితమే 
రూపకర్త సునీతమ్మ అద్బుతమే 
వారానికొ అంశముతో రచిస్తున్నామే 
చూడచక్కని తెలుఁగు సున్నితంబు 
52
తెలుగుభాషలొ ఎన్నో ప్రక్రియలు   
సున్నితం సృష్టికర్తకు షుక్రియాలు 
సున్నితానికి అంతర్జాతియ ప్రశంసలు 
*చూడచక్కని తెలుఁగు సున్నితంబు *
53
రెండోవ వార్షికోత్సవ సంబరమే 
సున్నితము ప్రక్రియ అద్బుతమే  
సృష్టికర్త సున్నితమ్మ మహాద్బుతమే 
చూడచక్కని తెలుఁగు సున్నితంబు 
54
వాట్సాప్లో ఎన్నో ప్రక్రియలే 
కవుల మేధస్సుతో రచనలే 
చిత్తశుద్దితో కవుల కవనాలే 
చూడచక్కని తెలుఁగు సున్నితంబు 
55
సున్నితాల రచనలకు బిరుదులే 
ద్వితీయ  వార్శికోత్సవ సంబరాలే
సృష్టికర్త సునీతమ్మకు వందనాలే 
చూడచక్కని తెలుఁగు సున్నితంబు 

కామెంట్‌లు