భారత్ బ్రహ్మ గాంధీ!!?;- ప్రతాప్ కౌటిళ్యా
గాండీవం ధరించిన
గాంధీ శక్తి-శాంతి

దేహము-కోరికలు
కాశీలో వదిలేస్తాం!!

దేశం కోసం
దేహము-వస్త్రము
వదిలేసిన ఒక యోగి గాంధీ!!?

ఋషులు తపస్సుతో
శక్తి పొందుతారు
అతీంద్రియ శక్తులతో
మనుషులు దేవతలు అవుతారు!!

దేశ విముక్తి కోసం
దేశముక్తి కోసం-తపస్సు చేసిన గాంధీ
రుషి మాత్రమే కాదు!!

రక్త మాంసాలతో పుట్టిన
భారతదేశ సాధారణ పౌరుడు
ఇప్పుడు
దేశానికే దేవుడైనాడు!!?

ఎర్రని రక్తంలో
ఇనుము దాగినట్లు
పచ్చని ఆకులో
మెగ్నీషియన్ దాగున్నట్లు
తెల్లని పాలలో
నెయ్యి దాగున్నట్లూ!!!

గాంధీ విగ్రహములో
ఒక సత్యం బాగుంది
సత్యాగ్రహం దాగుంది
ఒక నిగ్రహము దాగుంది
స్వేచ్ఛ స్వాతంత్రము దాగుంది!!?

న్యాయవిద్య చదివి
అన్యాయంపై ఉద్యమం చేసీ
దేశానికి న్యాయం చేసిన
న్యాయవాది గాంధీ!!?

ఉద్యమము యుద్ధము విద్య అనే
మాటలకు అర్థం మార్చి
ప్రజా పోరాటాన్ని చేసిన
మహా నాయకుడు గాంధీ!!?

దేశానికి ఆత్మ
అంతరాత్మ పరమాత్మ
మహాత్మ మన గాంధీ!!?

గాంధీ మళ్లీ జన్మిస్తే
దేశ సంపదను అందరికీ
సమానంగా పంచుతాడు!!?

విద్య వైద్యం ఆహారం
ఉచితంగా ఇస్తాడు!!?

కులం మతం పేదరికం
లేకుండా చేస్తాడు!!?

భారతదేశానికి గీతను బోధించిన
కృష్ణుడు గాంధీ!!?

భారతదేశ తలరాతను రాసిన
మరో బ్రహ్మ గాంధీ!!!

గాంధీ కింగ్ ఫౌండేషన్ కవి సమ్మేళనం లో చదివిన కవిత

Pratap koutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist
8309529273

కామెంట్‌లు