స్వేచ్ఛాoశం-నానీలు---సుమ కైకాల
1. గుండె గూటికి
    పండగొచ్చింది
    నాకు చేరువగా
    నీ రూపం!

2. కడ వరకూ 
    నను వీడనివి 
    చెరిపినా చెరగనివి
    నీ గురుతులే!

3. చుట్టూ
    సుగంధ పరిమళాలు
    మది గదినిండా
    కొలువుoది నువ్వే!

4. శరన్నవరాత్రులు
    దేదీప్యమానంగా 
    వెలిగిపోతుంది
    ఇంద్రకీలాద్రి!

5. నీడ నీవు ఒకటే
    ఒకటి బయట
    మరొకటి లోపల
    ఎప్పుడూ నాతోనే!

కామెంట్‌లు