స్వేచ్ఛాoశం-నానీలు-సుమ కైకాల
1. మరణం అంచుదాక
    చెదరని చిరునవ్వు
    జననం కోసం
    అమ్మ కదా!...

2. కలలు
    కలవరాలు
    నిజం కావేమోనని
    నిరాశతో కృంగకు!

3. మాట మధురం
    మనసు నవనీతం
    కలిపిన రూపం
    సుభాషిణి!

4. నాలోని  నీవు
    నీలోని  నేను
    నానీవు నేనేగా
    నీనేను నీవేగా!

5. నాలుగు మాటలు
    నాలుగు పoక్తులు
    రెండు భావాలు
    నానీలేగా!...

కామెంట్‌లు