స్వేచ్చాoశం--(హైకూలు);-సుమ కైకాల
1. అమావాస్యలో
   వెలుగు తోరణాలు
   దేదీప్యమానం!...

2. వెలుగుపూలు
    విరజిమ్ముతున్నాయి
    పూలకుండీలు!...

3. ఆకాశo లోకి
    దూసుకు పోతున్నాయి
    తారాజువ్వలు!...

4. వృత్తాకారంలో
    వెలుగులు జిమ్ముతూ
    విష్ణుచక్రాలు!...

5. ప్రతి ఇంటిలో
    పున్నమి కిరణాలు
    దీపజ్యోతులు!...

కామెంట్‌లు