కాగితమా! కాదేయది
సమాచార సాక్ష్యమ్మది
మనసుపొరలు దాటుకొని
గుండెచేరు ఆర్ద్రమ్మది!
ఎదలోని భావాలను
రాయబార మంపేను
ఆత్మీయు ఊసులతో
అనుబంధం పెంచేను!
ఉభయులతో కుశలమంటు
దీవెనలే తెలుపుకుంటు
ఉత్తరమొక వారదంట
ఉత్సాహం నింపుకుంటు!
మౌనంగా చదువుతుంటె
అయినవారు మెదులుతుంటె
అశ్రువులే తుడుచుకొనిరి
జలజలమని జారుతుంటె!
బతుకుదెరువు దారులలో
గగనమైన చూపులలో
ఉత్తరమొక నేస్తమౌతు
ఓదార్చెను గుండెలలో!
ప్రేమలనే తెలుపునంట
విరహాన్నే పెంచునంట
ప్రణయకావ్య వీచికలై
ఎదనుమీటు గుర్తులంట!
కనుమరుగై పోయెను
జ్ఞాపకమై నిలిచెను
సాంకేతిక వరదలో
అది కొట్టుక పోయెను!
లేఖలంటే ఎరుగరు.
చరవాణిల మునిగేరు.
నేటితరం యువకులంత
హలో యంటు గడిపేరు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి