*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0185)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పార్వతీ హిమవంతుల స్వప్నము - శివుని చేత అంగారక గ్రహ ఆవిర్భావ ప్రసంగము*
*నారదా! మేనకా హిమవంతులు, పార్వతీ వారు చూసిన స్వప్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మంగళకరము, భక్తి వర్ధకము, ఉత్తముడు అయినవభగవంతుడు అగు శంకరుని కీర్తి పరమ పవిత్రమైనది. దక్ష యజ్ఞము పూర్తి అయిన తరువాత కైలాసానికి తిరిగి వచ్చిన రుద్రుడు తన అర్ధాంగి ఉమ లేని లోటు అనుభవిస్తూ ధైర్యాన్ని కోల్పోయారు. తన పార్షదలను పిలిచి తన బాధను వారితో పంచుకున్నారు. అయిన స్థిరమైన మానసిక స్థితి పొందలేక దగంబరుడయి, ఉన్మత్తుని వలె, ఒక సామాన్య మానవుని లాగా లోకాలలో తిరుగుతున్నారు. కానీ, ఎక్కడ కూడా తన ఉమ కనిపించక, మరల తన కైలాసానికి వచ్చి, పరాత్పరుని మీద మనసు లగ్నం చేసి సుదీర్ఘమైన సమాధి స్థితిలో కూర్చున్నారు, రుద్రదేవుడు, శంభుడు. సమాధి స్థితిలో అవినాశుడై స్వయంగా మాయకు అధిపతి అయిన, నిర్వికారడగు పరబ్రహ్మ ను చూచి సంతుష్టుడయ్యాడు శివుడు. శివుడు సమాధి స్థితిలో కొన్ని వేల సంవత్సరాల కాలం ఉన్న తరువాత సమాధి నుండి బయటకు వచ్చాడు.*
*అంగారక జననం*
*సమాధి స్థితి లో వున్నప్పుడు శివుని శరీరానికి కలిగిన శ్రమ వల్ల ఒక చెమట బిందువు నేల మీద పడింది. అలా పడిన చెమట బిందువు, నేలను తాకగానే ఒక అందమైన ముద్దులొలికే బాలుని రూపం పొందింది. కళ్ళు తెరచిన వెంటనే ఆ బాలుడు చూచిన రూపం, శివుడు. తన్మయత్వంతో శివుని కీర్తించాడు. ఆ తరువాత, భూమి స్పర్శ వల్ల ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు, భూదేవి ఆ బాలుని అక్కున చేర్చుకుని, తన స్థన్యమిచ్చి బుజ్జగించుతుంది. ఆ బాలునికి తాను కన్నతల్లి కాక పోయినా ఆతడు తన బిడ్డడే అనే మమకారంతో దగ్గరకు తీసుకుంటుంది.*
*సంసారమును సృష్టి చేసి నడిపించి, పెంచువాడు, విద్వాంసుడు, సర్వాంతర్యామి అయిన శివుడు, తన మానస పుత్రుడైన బాలుడిని,భూమి దగ్గరకు తీసుకోవడం చూచి " భూదేవీ! నీవు ధన్యరాలవు. ఎంతో ఉత్తముడైన నా ఈ కుమారుణ్ణి నువ్వు ప్రేమతో పెంచు. ఈ బాలుడు నా చెమట బిందువు నుండి పుట్టినా, నిన్ను తాకగానే రూపందాల్చాడు. కనుక నీ పేరుతోనే ప్రసిద్ధి పొందుతాడు. ఇతనికి ఎటువంటి తాపత్రయాలు లేవు. అత్యంత గుణవంతుడు. నీ అభిరుచుకి తగ్గట్టుగా ఈ బాలుని పెంచి పెద్ద చేయి,వసుధా!" అని పలుకుతారు.*
*ఈ బాలుడు పుట్టిన తరువాత శంభునికి, లోకాచారము పాటిస్తున్న శివునికి, తన ఉమా వియోగ భారము కొంత తక్కువ అయింది. నిర్వికారుడైన పరమేశ్వరుని కి విరహమెక్కడిది. లీలా మానుష విగ్రహం కదా! శివుని మాటలు విన్న భూదేవి, ఆ బాలుని తీసుకుని స్వస్థలం కు వెళ్ళింది. ఈ బాలుడు "భౌముడు", " అంగారకుడు, కుజుడు, లోహితాంగుడు, మహీసుతుడు" అనే పేర్లతో ప్రసిద్ధి చెందాడు. యవ్వనము రాగానే కాశీ నగరానికి వెళ్ళి, విశ్వనాథుని కృపతో, గ్రహ పదవి పొంది శుక్ర లోకమునకు అవతల వున్న దివ్యలోకమునకు వెళ్ళాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు