*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0193)*
 *"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*రుద్రుని కోపానికి కామదేవుడు భస్మం అవడం - రతీదేవి ప్రార్థన - ద్వాపరయుగం - ప్రద్యుమ్న రూపం - పునర్జన్మ - రతీదేవి శంబరనగరమునకు వెళ్ళడం.*
*నారదా! "దేవా! శరణాగతవత్సలా! మహేశ్వరా! పాహి!పాహి! స్వామీ, కామదేవుడు నీ పైన తన పూలబాణాలు వేసాడు కానీ, ఈ పని చేయడంలో ఆతనికి ఎటువంటి స్వార్ధమూ లేదు. లోక కళ్యాణం కోరుకుంటూ మేమందరమూ మన్మధుని సహాయం కోరాము. తారకాసురుని చేత మా దేవతా సమూహము అంతా ఇంద్రునితో సహా పీడింప బడ్డాము. అన్ని లోకాలు, ఈ బ్రహ్మ వర గర్వముతో ఉన్న తారకాసురుని బారిన పడి వ్యధ చెందుతున్నాయి. అప్పుడు, మేము అందరమూ, బ్రహ్మను పార్ధింపగా, మీరు పార్వతీ దేవిని పరిణయము చేసుకుంటే, మీకు కలిగే సంతానము చేత తారకాసురుడు చంప బడతాడు,అని తెలుసుకుని, మీ శివపార్వతుల కళ్యాణం జరగాలని కోరుకుంటూ, మన్మధుని సహాయం అడగడం జరిగింది. ఇందులో కామదేవుని తప్పు ఏమీ లేదు. భర్తను పోగొట్టుకున్న రతీదేవి బాధను తగ్గించి, ఆమెకు సాంత్వన చేకూర్చండి, ప్రభూ! మీరు ఇప్పుడు కామదేవుని సంహరిస్తే, లోకాలను మీలో లయం చేసుకుంటారు ఏమో అని మాకు అందరికీ భయంగా ఉంది. రతీదేవి శోకం పోగొట్టి, గిరిరాజ కుమారిని చేపట్టి, లోకాల కడగండ్లను దూరం చేయండి, పన్నగభూషణా!" అని దేవతలు పార్ధించారు.*
ఈ ప్రార్థన విన్న ఫాలచంద్రధరుడు, "దేవతలారా! నాకు కలిగిన కోపము వలన జరుగ వలసిదే జరిగింది. ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవిని వివాహం చేసుకునేవరకు, రతీదేవి భర్త అయిన మన్మధుడు                 " అనంగుడు" (శరీరము లేని వాడు)గా ఉంటాడు. తరువాత, ద్వారకలో రుక్మిణీ గర్భములో "ప్రద్యుమ్నుడు" గా పుడతాడు. ఈ బాలునితో విరోధము పెట్టుకుని, శంబరాసురుడు చనిపోయిన శిశువు అనుకుని, ప్రద్యమ్నుని సముద్రములో పడేసి, శంబరాసురుడు తన నగరానికి వెళతాడు. రతీదేవీ, నీవు కూడా వశంబరుని నగరంలో ఉండు. సముద్రంలో పడవేయబడ్డ ప్రద్యుమ్నుడు శంబరాసురుని నగరం చేరతాడు. అప్పుడు, రతీదేవి తో కలసి ప్రద్యుమ్నుడు, శంబరాసురుని యద్ధంలో గెలిచి, ఆతని అన్ని సంపదలతో కూడి ప్రద్యుమ్నుడు అయిన మన్మధుడు తన నగరానికి వెళ్ళి సుఖంగా ఉంటాడు. ఇందులో ఏవిధమైన అనుమానము అక్కర లేదు" అని పలికిన శివుని మాటలు వన్న రతీదేవి, దేవతా సమూహము అందరికీ అమితమైన ఆనందం కలిగింది.*
*సమస్తమునకు అధిపతి, కరుణాసాగరుడు, పరమేశ్వరుడు అయిన రుద్రుడు మరల ఇలా ఆన్నారు. "ద్వాపరయుగం వరకు, అనంగుడుగా వున్న మన్మధుడు అందరి మనసులలొ తిష్ట వేసుకుని జీవిస్తూ ఉంటాడు. నేను మీ అందరి దుఃఖమును తొలగిస్తాను. మీరు మీ మీ నెలవులకు సుఖంగా వెళ్ళండి" అని చెప్పిన అఖిలాండ నాయకుడు, అంతర్ధానం అయ్యారు. కాముని భార్య రతీదేవి శివ ఆజ్ఞతో శంబరాసురుని నగరం చేరి రావలసిన సమయం కోసం వెదురు చూస్తూ ఉంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు