*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 091*
 *ఉత్పలమాల:*
*ఎక్కడి తల్లిఁదండ్రి సుతు | లెక్కడిఁవారు కళత్ర బాంధవం*
*బెక్కడ జీవుఁడెట్టి తను | వెత్తుచుఁ బుట్టుచుఁ బోవుచున్న వాఁ*
*డొక్కఁడె పాపపుణ్యఫల | మొందిన నిక్కఁడె కానరాఁడు వే*
'రొక్కఁడు వెంటనంటి భవ | మొల్లన యాకృప జూడవయ్య నీ*
టక్కరిమాయలందిడక | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
అమ్మ, నాన్న అనే బంధము, భార్య, నిడ్డల బంధము, చుట్టాలు అనే బంధము ఎక్కడ వున్నాయి. మనము చేసిన పాప, పుణ్యాల ఫలముగా జీవుడు పుట్టడము, చనిపోవడము జరిగేటప్పుడు ఆ జీవుడు ఒకడే ప్రయాణము చేస్తాడు ఎవరూ తోడు రారు. నీవు నీ అల్లరి పనులు, మాయ మాటలు పక్కన పెట్టి, మమ్మల్ని దయతో చూడు స్వామి!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"ఏది నిత్యం! ఏది సత్యం! పరబ్రహ్మ పరాత్పరుడు తప్ప " ఏదీ శాస్వతము కాదు. ఎవరూ నిత్యజీవులు కారు. బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా ఈ బొందిలో ప్రాణం వున్నంత వరకే. ఆ బొందితో సంపదలూ, సౌకర్యాలు ఉన్నంత వరకే. మన దగ్గర డబ్బు, సందలు లేవు అని తెలిసినప్పుడు ఎవరూ మనతో వుండరు. రారు. కానీ, ఈ నిజం అంత తేలికగా వంటబట్టదు, ఎవరికైనా. పరమాత్మ పరబ్రహ్మ తనంత తాను అనుగ్రహం చూపితే తప్ప ఈ పరతత్వ జ్ఞానం మనుషులకు తెలియదు. ఆ సదాశివుడు మనకు అందరికీ ఇంతటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు