*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 100*
 *చంపకమాల:*
*భ్రమరము కీటకంబుఁగొని | పాల్పడి ఝాంకరణోపకారియై*
*భ్రమరముగా నొనర్చునని | పల్కుటఁజేసి భవాదిదుఃఖ సం*
*తమస మెడల్చి భక్తి సహి | తంబుగ జీవుని విశ్వరూప త*
*త్త్వమున ధరించటేమరుదు | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
తుమ్మెద ఒక పురుగును తీసుకు వచ్చి తాను చేసే ఝంకార శబ్దముతో ఆ పురుగును తుమ్మెదగా మార్చగలిగి నప్పుడు, మానవుడు పుట్టినప్పటి నుండీ ఆతనికి కలిగే దుఃఖములను అన్నిటినీ తీసివేసి ఆ మానవునికి భక్తిని కలిగించి నీ పరతత్వము ను బోధించి ఉద్ధరించుట సాధ్యమే కదా !.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ సకల చరాచర జగత్తులో వున్న ఏ ప్రాణిని అయినా తన భక్తునిగా మార్చుకో గలిగిన వాడు, పరమేశ్వరుడు. పాము, సాలెపురుగు, ఏనుగులకు తనపై భక్తి కలిగించి, మూడు జీవులకు ఏకకాలంలో మోక్షము ఇచ్చిన పరమైక మూర్తి, సదాశివుడు. వేదాంత జ్ఞానము ఏమాత్రమూ లేని కన్నప్పకు, కేవలం తన మీద కలిగిన భక్తి భావము వల్ల ప్రత్యక్ష దర్శనమే ఇచ్చి సత్కరించి తనతో శివలోకానికి తీసుకు వెళ్ళారు. పరమాత్ముని మీద నిలకడగా భక్తి భావము కలిగి ఉండటం కన్నా, మానవునికి కలిగే గొప్ప వరం ఇంక ఏమి ఉంటుంది. అటువంటి గొప్ప వరాన్ని మన అందరికీ ఇవ్వమని, తన దారిలోకి మనలను తీసుకువెళ్ళి, చివరి దాకా చేయి వదలకుండా పట్టకుని, శివైక్యం చేసుకోమని, ఆ ఉమాపతిని వేడుకుంటూ........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు