*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 102*
 *ఉత్పలమాల:*
*పట్టితి భట్టరార్యగురు | పాదము లిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్*
*పెట్టితి మంత్రరాజ మొడి | ఁబెట్టితి నయ్యమకింకరాలికిం*
*గట్టితి బొమ్మ మీచరణ | కంజములందు, దలంపు పెట్టిపోఁ*
*దట్టితిఁబాప పుంజముల | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
భట్టరార్య గురువు గారి పాదములు నమ్మి పట్టకుని, తురు నామము కూడా పెట్టకుని, నీ రామనామము అనే మంత్ర రాజమును కూడా పట్టుకుని యమ దూతలను కూడా ఓడించ గలిగాను. రామభద్రా! నీ పాదాలు పట్టుకుని నమ్మికతో ఉన్నాను. అందువల్ల, నా పాపపు గుట్టలను నాశనం చేసి నన్ను ఉద్దరించు తండ్రీ!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రామచంద్ర ప్రభో! దీనబంధో! మేము నిలువు నామాలు, అడ్డబొట్లు ఎన్నైనా పెట్టవచ్చు. గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు డబ్బు ఖర్చు చేసుకుని, ఒళ్ళు హూనం చేసుకుని తిరిగి రావచ్చు. కానీ, అన్నీ తానే అయి, అన్ని పేర్లు తనవే అయి, ఇక్కడ ఉన్న జీవులు అన్నీ కూడా తానే అయి, ఒక్కడి గానే ఉన్న ఆ పరాత్పర, పరబ్రహ్మ, పరతత్వమును మనకు నచ్చిన పేరుతో, నమ్మికతో జపం చేస్తూ ఉంటే అడుగకుండానే నీకు రావలసిన నీవంతు ఫలితాన్ని నీకు ఇవ్వడానికి తయారుగా ఉంటాడు. ఇది కదా, సత్యం. మరి, దీనిని వదలి, అనవసరమైన శ్రమ చేయడం అవసరం లేదు కదా. రామభద్రా! సుందర రామా! ఆ నీ నామాన్ని మేము పట్టుకుని ఉండేట్టు నీవే చేయగలవు. చేయాలి కూడా. నువు చేస్తావు అనే నమ్మకంతోనే ఉన్న మాకు నీవే రక్ష మాకు, సర్వజగద్రక్షకా!........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు