జగతికి వెన్నెముక స్త్రీ (4);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆడవారు వంట చేసేటప్పుడు  పట్టు చీర ధరించడానికి కారణం ఆ రోజుల్లో కట్టె పొయ్యలు వాటిపైన వంట  ఆ పొయ్యి నుంచి నిప్పురవ్వలు మన పైన పడుతూ ఉంటాయి  ఆపడ్డ రవ్వ సున్నితమైన బట్టలు పెట్టుకుంటే  మండిపోతాయి. అదే పట్టు బట్ట అయితే  అది పడడం వల్ల చిన్న రంధ్రం ఏర్పడుతుంది తప్ప ప్రమాదం ఉండదు. ఆమె ప్రాణాలను కాపాడే శక్తి ఆ పట్టు వస్త్రానికి ఉండడం కారణం. ఆవు పేడతో అలికిన ఇంటిలో చాప మీద వరుసగా కూర్చున్న వారికి పట్టు వస్త్రాలు ధరించిన గృహిణి మాత్రమే వడ్డన చేయాలి  అది నియమం, మన సంప్రదాయం కూడా. సంప్రదాయాన్ని  అనుసరించడంలో ఉన్న శాస్త్రీయ దృక్పథం  అమ్మాయిలకి తెలియకపోవచ్చు. విస్తట్లో  అన్ని పదార్థాలు వడ్డించిన తరువాత మనకు కనిపించీ  కనిపించని క్రిమికీటకాదులు విస్తరి పైకి రావడానికి అవకాశం ఉంది. అందుకే ఆపోసన పేరుతో విస్తరి చుట్టూ నీళ్లు చల్లడం దాని వల్ల అవి విస్తట్లోకి రావు. వడ్డించేటప్పుడు  గృహిణి కట్టిన  పట్టుచీర లక్షణం  రోగకారక క్రిమి కీటకాలను నాశనం చేస్తోంది చీర. దాని అంచు దానికి తగలగానే అది చనిపోతుంది కనుక పెద్దల మడి ఆచారం అనే మాటలు మనకు  కొత్తగా అనిపించినా  శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాటు చేసిన మేలు. ప్రపంచం మొత్తం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తున్న సమయంలో మెకాలే పుణ్యమా అని  పాశ్చాత్య విద్యకు అలవాటు పడింది  వారి సంప్రదాయాలకు లోనై మన సంప్రదాయాలను  మర్చిపోయాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే అంత వరకు మనం చేసే ప్రతి పనికి శాస్త్రీయతను  దృష్టిలో పెట్టుకొని దానిని అనుసరించే లక్షణాల నుంచి ఉగ్గుపాలతో వారికి నేర్పి వారి ఆరోగ్య భద్రత చూశారు పెద్దలు అన్న విషయాన్ని మర్చిపోతాం. పరాయి దానిని అనుసరించవచ్చు ఎప్పుడు  అది అందరికీ ఆమోదయోగ్యమైన అప్పుడు మాత్రమే. అలంకరణలతో వచ్చిన అమ్మాయిని చూసి  అందరూ ఒకే రకంగా అనుకోరు. ఈ అమ్మాయి ఆర్థికంగా బాగా బలిసి  ఉంది కనుకనే అన్ని ఆభరణాలు పెట్టింది  అని ఇంగ్లీష్ లో ఏద్దేవా చేస్తూ ఉంటారు.  ఎంత ముచ్చటగా ఉంది ఈ పాప  అని ఆనందించేవాడు ఉన్నారు. ఆమె మనసు వెన్న,  ఆమె మనసు బంగారం  అనడంలో అర్థం వీళ్లకు నవనీతం అనే పేరు ఉంది  కృష్ణుని నవనీత చోరుడు అంటారు  అతి చిన్న వేడికి కూడా కరిగిపోతుంది వారి మనసు చూడాలంటే  ఎవరికి ఏ కష్టం వచ్చినా అయ్యో పాపం అని  బాధపడటం అనేది కాదు కావలసిన సహాయం కూడా చేస్తుంది. అలాగే మనసు బంగారం  బంగారానికి ఉన్న గుణం  చెడును చేరనివ్వక పోవడం  మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలియని స్థితిలో ఉన్న అమ్మాయి అంటారు ఏ కొంచెం జ్ఞానం కలిగిన వారైనా.కామెంట్‌లు