గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (48);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ పల్లె లోనైనా  చిన్న పిల్లల మనస్సు ఆటల మీద ఉంటుంది  వారికి సమయం దొరకలే కానీ రకరకాల ఆటలు   సృష్టించగలరు  ఎండ తగలకుండా నీడ పట్టున ఉండి ఆడే ఆటలు, ఎండలో చెమటలు కారుతూ ఆడే ఆటలు రకరకాలుగా ఉంటాయి పిల్లలు తక్కువగా ఉన్నప్పుడు  నాలుగు స్తంభాలాట ఆడతారు  ఆటగాళ్లు ఐదుగురు ఉంటారు  స్తంభాలు నాలుగు ఉంటాయి  పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు స్తంభాలు గాని ఎనిమిది స్తంభాలు గాని ఎన్నుకొని ఆట ఆడతారు  ఈ ఆటలో ఎక్కువ వేగంగా పరిగెత్తే  అలవాటు తో పాటు  ఏ స్తంభం ఖాళీగా ఉంటే దానిని అంటుకుని  దానితోనే ఉండే ఏర్పాటు చేసుకునే తెలివి పెరుగుతుంది. అవతల వాడికి కూడా అలాంటి ఆలోచన వస్తుంది కదా  కనుక వాడిని మించిన ఆలోచన చేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ఆటలో శివ నాగిరెడ్డి గారిది అందెవేసిన చెయ్యి. ఎండ తగలకుండా నీడ లో కూర్చుని ఆడే ఆటలు  ఎక్కువగా ఆడవారు  తర్వాత చిన్న పిల్లలతో ఆట  ఆడే ఆడపిల్లలు  పల్లెటూర్లలో మనకు కనిపిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఆడే ఆట వాన గుంటలు ఒక గుంటలో  11 చింతపిక్కలను ఆడే  మెదడుకు పని చెప్పే ఆట  ఏ గుంట ఖాళీ అయితే దానిని నింపడానికి  దానిలో వచ్చిన పిక్కలను సర్ది పంచడానికి  కొన్ని పద్ధతులను పెడితే తప్ప 
విజయం సొంతం కాదు  అలాగే పల్లెటూరులలో ఆడే  ఆట మేక పులి. మేకను పులి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు  దానిని ఎలా కాచి రక్షించాలో  ఆటగాడికి తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరి ఎత్తులకు  ఎదుటివారు పై ఎత్తు వేస్తే వారు గెలిచినట్లు లెక్క  ఈ పందెం ఆడేటప్పుడు కొంతమంది పందేలు కాస్తారు  ఆట చూసుకునే వాడు కూడా పై పందెం కలుపుకుంటారు వాడు గెలుస్తాడని వీడు వీడు గెలుస్తాడని వాడు  చాలా ఆహ్లాద బరితంగా ఉంటుంది ఆ ఆట. ఎక్కువగా దాడి అనే ఆట బాగా ప్రాచుర్యం చెందింది  పల్లెలలో  చక్కటి కార్యక్రమం తో పాటు  పోటాపోటీగా ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐదు గదులలో  చతురస్రాకారంగా గీయబడిన ఆట. చతురస్రాకారంలో 5 గడులతో  ఈ ఆట ఆడతారు.  దీనిలో కొన్నిటికి ఇంటు మార్క్ చేసి పెడతారు. వాటిలో  ఉన్న కాయలు  క్షేమంగా ఉంటాయి.అది  లేకపోయినట్లయితే ఈ రోజు ఆ గుంటలో వున్న దానిని చంపుతాడు ఇది కూడా ఎంతో ఉత్తేజంగా ఆడవాళ్లు ఆడే ఆట.


కామెంట్‌లు