గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (51);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 చిన్నతరగతిలో విద్యార్థులకు  చదువు మీద కన్నా ఆటల మీద మోజు ఎక్కువ  ఎప్పుడు ఈ పీరియడ్ అయిపోతుందా ఎప్పుడు ఆటలు ఆడదామా అన్న  ఊహల్లో ఏ ఆటలు ఆడాలో ఎవరితో ఆడాలో అనేది కూడా ఇక్కడే నిర్ణయించుకుంటాడు. ఆటలాడేటప్పుడు  వారి తరగతిలో ఉన్న ఆడపిల్లలు కూడా ఆడడానికి మొగ్గు చూపిస్తారు. ఆ వయసులో ఆడ మగ భేదం అని తెలియదు వాళ్లకు. ఎలాంటి దురభిప్రాయాలు లేకుండా ఇంట్లో తన చెల్లితో అక్కతో ఎలా ఆడుతూ ఉంటారో  అంత చొరవగా ఆడుతూ ఉంటారు. ఆటలో కక్ష్యలు కార్పణ్యలు కొట్టుకోవడాలు సహజం. అక్కడ గురువుగారి సహకారం అవసరం  మీరు బాగా ఆడుకోవాలి అనుకుంటే  ఒకరి పైన ఒకరికి మీరు చూయించుకుంటున్న ఈ  కోపతాపాలను  కసిగా మార్చుకుని దానిని ఆట మీద చూపండి. అప్పుడు విజయం తప్పకుండా మీ చేతికి అందుతుంది లాంటి సలహాలిస్తే  తిరిగి పెద్దవారైన తర్వాత కూడా ఆ మాటలను జ్ఞాపకం పెట్టుకొని  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాడు  అలా ఉండాలి గురూజీ.
సామాన్యంగా పల్లెటూర్లలో  పెద్దవాళ్లతో పాటు చిన్న పిల్లలు కూడా పొలం వెళ్లడం  అక్కడ తల్లిదండ్రులకు సహకరించడం  చేస్తూ ఉంటారు. కానీ శివనాగి రెడ్డి గారి తల్లిదండ్రులు అసలు ఏ బిడ్డ కైనా  ప్రథమ గురువు తల్లి అని చెబుతారు. వీరి మాతృమూర్తి పేరు అన్నపూర్ణ  ఆ పేరులోనే పరిణతి ఉన్నది  అన్నపూర్ణ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక మహాకవి  తెనాలి రామకృష్ణుడు, అన్నపూర్ణమ్మను గురించి వర్ణిస్తూ అతిథులను అభ్యాగతులను ఆదరించే తత్వాన్ని గురించి చెబుతూ  కొసరి కొసరి వడ్డించుతూ  అన్న వాక్యాన్ని  పదాన్ని వాడాడు  ఆ లక్షణం ఈమెలో ఉన్నది  ఎవరు ఆకలితో నకనకలాడుతున్నా చూసి భరించలేని తత్వం ఆమె సొంతం  మరి తన బిడ్డను ఎలా పెంచిందో ఆ తత్వాన్ని బట్టి ఊహించుకోవచ్చు.
అలా ఉత్తమ విద్యార్థిగా  బయటపడి వారి గ్రామం లోనే  ఉన్నత పాఠశాలలో చేరారు.  చేరినప్పటి నుంచి తన ప్రభ  నలుగురికి తెలిసేలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు  ప్రథమ శ్రేణి విద్యార్థులలో  ఉత్తమునిగా  పేరుపొంది అన్ని రంగాలలోనూ  పాల్గొనేలా పెరిగాడు  దీనికి అధ్యాపకుల సహకారం ఎంతైనా అవసరం  నాకు మా గ్రామంలో  బూర్గుల పురుషోత్తమ శాస్త్రి గారని తెలుగు మాస్టర్ ఉండేవారు  ఎవరిని కొట్టడం కానీ తిట్టడం కానీ చేసేవారు కాదు  ఒక పద్యాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివి  దానికి అర్థతాత్పర్యాలు చెప్పి దానిని మొదటి బెంచిలో ఉన్న మొదటి కుర్రవాడితో  చదివించి తర్వాత మూడవ వరుసలో మధ్యలో కూర్చున్న వాడితో చివరిగా చివర ఉన్న వాడితో చదివించడం వారికి అలవాటు  దీనివల్ల ఆ పద్యం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవవలసిన అవసరం ఉండేది కాదు  ఆయన చదివినప్పుడే చాలా పదాలు మెదడుకు పడతాయి వీరు ముగ్గురు చదివిన తర్వాత అది  మనస్సు నుంచి పొమ్మన్నా పోదు అలాంటి ఉపాధ్యాయుడు శివ నాగిరెడ్డి గారికి దొరకడం ఆయన అదృష్టం.

కామెంట్‌లు