గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (53)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఆరు మళ్ళ కోటిరెడ్డి గారిని గురించి చెప్పవలసి వస్తే  గ్రామాలలో ఇంటి పేర్లు ఎలా వస్తాయో తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది సామాన్యంగా గ్రామాలలో  వరి పండించే ప్రాంతాలలో రైతులెవరు  నారు  మడులు వేసుకునే పరిస్థితిలో ఉండరు చాలా మంది  ఆ గ్రామంలో ఉన్న మోతుబరి రైతులు  మడులను కట్టి  నారు పెంచి బీదవారికి సహకరిస్తూ ఉంటారు. అలాంటి మడులు ఆరు ఉన్నవారు కనుక అరుమళ్ళ వారు అనే పేరు వచ్చిందని ఒక వ్యాఖ్య. కోటి అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆ రోజులలో లక్షాధికారిగా ఉండడమే గొప్ప అలాంటిది కోటీశ్వరుడు అంటే వేళ్ళ మీద లెక్కించదగిన వారు  అలాంటి వారిలో వీరు ఒకరు  వ్యక్తిగతంగా చెప్పవలసిన వస్తే  గుణగణాలను కీర్తిస్తూ కోటి మందిలో వీడోకడురా అంటారు పెద్దలు. అలా పేర్లు రావడం ఆనవాయితీ  కోటి రెడ్డి గారికి చిన్నతనం నుంచి ఆంధ్రభాష మీద మక్కువ ఎక్కువ  ఆ భాష ఆనుపానులు తెలుసుకొని లోతుగా  అధ్యయనం చేయాలన్న అభిప్రాయంతో  ఉపాధ్యాయ వృత్తినే స్వీకరించి  దానికోసం శిక్షణ పొంది  రెడ్డి గారికి గురువుగా వచ్చారు.వారు రావడం నిజానికి  శివ నాగిరెడ్డి గారి జీవితాన్ని ఒక గాడిలో పెట్టడానికి  జీవిత మార్గాన్ని తెలియచెప్పడం కోసం  అన్నట్టుగా ఆ సంఘటన జరిగింది. పుస్తకజ్ఞానం కాదు అనుభవ జ్ఞానం కావాలని నేర్పిన వారు కోర్టు రెడ్డి గారు  అలాగే ఇతరులకు సహకరించడం  సాయం చేయడంలో కూడా నిజమైన బాధితులు ఎవరో ముందు గ్రహించాలి  ఇవాళ యాచకులు ఉన్నారు. వారిలో కొందరు ముసలి వారిని అడ్డుపెట్టుకొని వారి సంతానం అనుభవిస్తూ ఉంటుంది అలాంటి వారిని చూసి సాయ పడవలసిన అవసరం లేదు  ఎవరో ఒక చిన్న పిల్ల ఆకలి అని అడుగుతూ మీ వెంటపడితే  ఆ పాపకు డబ్బులు ఇవ్వవద్దు దగ్గరలో ఉన్నటువంటి హోటల్ కి వెళ్లి  లేదా ఇవాళ ప్రతి రోడ్డులోనూ ఏదో ఒక బండి  తిను పదార్థములతోనే ఉంది అక్కడ ఆమె కడుపు నింపటానికి కావలసిన ఇడ్లీ కానీ అక్కడ ఉన్న ఏదో ఒకటి తీసుకొని ఆమె ఆకలి బాధను తీర్చండి తప్ప ధన సహాయం చేస్తే అది సద్వినియోగం కాదు. అందుకే మనం దానం చేసేటప్పుడు కూడా అర్హులను ఎంచుకొని వారికి ఇవ్వాలని వ్యాస మహర్షి చెప్పారు. అలాగే అత్యవసరంగా ఒక వయసు మళ్ళిన మదుసలి రోడ్డు మీదకు వచ్చి మందులు తీసుకునే ప్రయత్నాల్లో  రోడ్డు దాటడానికి ఎక్కువ రద్దీ ఉండడంతో  బాధపడుతూ ఉంటుంది దాటే ఓపిక లేదు దాటించే వ్యక్తులు కనపడలేదు  అలాంటి వారిని చేయిబట్టుకొని ఆ చివరి వరకు తీసుకువెళ్లి మందులు ఇప్పించి  తిరిగి ఆ రోడ్డును దాటించి ఇంటికి పంపితే  ఆ ముదుసలి ప్రాణం ఎంత ఆనందంతో  నిండుతుంది  వారు ఏదో కృతజ్ఞతలు చెబుతారని కాదు  బాధ్యతగా అవసరమైన వారికి వారి అవసరాలను తీర్చడంలో  మనం తీసుకోవలసిన జాగ్రత్తలు  మనకి ఒక అవగాహన లేనప్పుడు  ఆ పనిని మనం ఎలా పూర్తి చేయగలం. కనుక అన్నీ ముందు తెలుసుకొని ప్రణాళికా బద్ధంగా జీవితాన్ని గడపాలి  శివ నాగిరెడ్డి గారికి జీవితంలో  అనేక పర్యాయాలు కోటి రెడ్డి గారు చెప్పిన ప్రతి వాక్యం  అనుభవంలోకి వచ్చినదే.

కామెంట్‌లు