ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో ప్రతి తరగతిలోని విద్యార్థులను ఎన్నుకొని ఉపాధ్యాయుడు ఆలస్యంగా వచ్చినప్పుడు వీరు అల్లరి చేయకుండా అటు ఇటు తిరగకుండా చూసే బాధ్యతను అప్పగిస్తారు వాడిని మ్యానేటర్ అంటారు. ఏ విద్యార్థి అందరితోనూ కలిసి మెలిసి ఉంటాడో చురుగ్గా ఉంటాడో వీటన్నిటితో పాటు మంచి మార్కులు తెచ్చుకుంటాడో అతనిని ఎన్నిక చేస్తారు ఉపాధ్యాయులు. ఆ అవకాశం శివ నాగిరెడ్డి గారికి రావడం దానిని వారు సద్వినియోగం చేసుకోవడం వల్ల జీవితంలో తనకు కలిగిన అవకాశం నాయకులకు ఉండవలసిన లక్షణాలు ఆ చిన్న వయసులోనే అలవాటు పడడం. స్త్రీ పురుష భేదాలను గమనించి ఎవరికి ఎలా గౌరవ మర్యాదలు ఇవ్వాలో తెలియడం. ఎవరికి నిజమైన అవసరం ఉన్నదో తెలుసుకొని దానిని చేయడానికి సహకరించే గుణం అలవడింది. ఇవన్నీ ఆ రోజుల్లో అధ్యాపకులు తనకు ఇచ్చిన ఆస్తి. ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలతో పాటు వక్తృత్వ పోటీలలో కూడా ఎప్పుడూ ప్రధమంగానే వుండేవాడు ఉపాధ్యాయులు ఏ అంశాన్ని ముందుగా ప్రకటిస్తారో దానిని గురించిన సమాచారాన్ని సేకరించి సమగ్రంగా పూర్వాపరాలేమిటో తెలుసుకొని ఒకవేళ తనకు ఏవైనా సందేహాలు వస్తే ఆయన నమ్మిన గురువుగారు కోటిరెడ్డి గారి దగ్గరికి వెళ్లి నివృత్తి చేసుకొని వచ్చి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విద్యార్థులంతా కరతాళ ధ్వనులతో అభినందిస్తూ ఉండేవారు. వీరితో పాటు చదువుతున్న పర్వతాల రెడ్డి స్వామి రెడ్డి ఎప్పుడూ పోటీ దారులుగా ఉండేవారు ఒకరిని మించి ఒకరు చాలా బాగా చెప్పాలన్న ఆకాంక్షతో ఎప్పుడూ ఈ ముగ్గురు ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో నిలబడేవారు. ఆ అనుభవం నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడింది. చరిత్రను గురించి గానీ, సాహిత్యాన్ని గురించి కానీ, సంస్కృతిని గురించి గానీ చెప్పే స్థితికి వచ్చారంటే దానికి మూలం కోటి రెడ్డి గారు అలాంటి వారిని మర్చిపోవడం సాధ్యమా. ఆ రోజులలో వీరి మరొక ఉపాధ్యాయులు వేదాల రంగాచార్యుల గారు. వారి వల్లనే ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లాలని కోరిక రావడం రెడ్డి గారికి చిన్నతనం గురించి ఉన్న చిన్న అలవాటు ఆయన ఎటు నడిచి వెళ్లినా ఏ చిన్న రాతి బొమ్మను చూసినా దానిని చూసి దాని మొత్తం స్వరూపాన్ని చేయడానికి ప్రయత్నం చేసేవాడు. మంచి మంచి శిల్పాలను చూసినప్పుడు మనస్సు తన్మయత్వం చెందేది తానే ఆ శిల్పాన్ని చెక్కితే ఎలా ఉంటుంది అని ఆ చెక్కిన స్థపతి స్థానంలో తనను ఊహించుకొని ఎంతో మురిసిపోయేవాడు. ఆ కోరిక అలా అజంతా ఎల్లోరా శిల్పాలను చూడడం మిగిలిన వాటి ప్రభావం వల్ల జీవితంలో మంచి శిల్పిగా తయారు కావడం ఎలా అన్న దాన్ని గురించి ఆలోచించడమే తప్ప ఎవరితోనూ ఆ మాట చెప్పలేదు.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (54);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి