ఊహల కాగితం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనసులోని ఊసులను
నింపాలని తెల్లని ఊహల కాగితాన్నినేల పై పరచి....
రంగురంగుల కలాలతో నా భావాలకు వర్ణనలను 
అద్దాలని నా కలాన్ని కదిలించాను....
మొదట,
నీలిరంగుని అద్దాను ప్రయత్నం .నెరవేర లేదు...
చిలుక పచ్చరంగుని అద్దాను చింతతీరలేదు....
గులాబీ రంగుని అద్దాను గుబులుపోలేదు....
పసుపు రంగుని అద్దాను ఫలితం లేదు....
కాటుక రంగుని అద్దాను కలత తగ్గలేదు.....
ఎరుపు రంగుని అద్దాను ఏం లాభంలేదు....
మొత్తంగా రంగులన్నిటిని కుమ్మరించాను 
అయినా కానీ…
మంచు ముత్యాల లాంటి 
నా అక్షరాలు ఏ మాత్రం మెరవలేదు.....
విసుగొచ్చిన నేను విసురుగా లేచి చూడగా....
నిశబ్దంగా చుట్టు ప్రాంగణం....నిద్రావస్తలో అందరు జనం....
అప్పుడు తెలిసి వచ్చింది నాకు.....
ఇంకా రేయి కనురెప్పలు విప్పలేదని....
రవి కిరణాల కాంతి, వెలుగై రేయి పై
దుప్పటిని ఇంకా కప్పలేదని....


కామెంట్‌లు