సమన్వయం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నేను ఒక రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతూ  పిల్లలతో కాసేపు కాలక్షేపం చేయడానికి వెళ్లాను. నేను గేటు దగ్గరికి వెళ్లేసరికి  చెర్రీ  ఎవరితోనో చొక్కా పట్టుకొని  గట్టిగా కేకలు వేస్తున్నాడు  అతనిని కొట్టడానికి చేయి కూడా లేచింది నేను ఆ చేయి పట్టుకొని దించి  ఏం జరిగింది నాన్నా ఉన్న విషయం చెప్పు  అని అడిగితే  చెల్లిని చిన్నపిల్లను చేసి  కొడుతున్నాడక్కా అందుకే నేను అతని మీద చెయ్యి చేసుకున్నాను అంటే నాకు చాలా ఆనందం వేసింది.  ఎందుకంటే  ఈరోజు రక్తసంబంధీకులు కూడా  ఎవరికి ఏది జరిగినా పట్టించుకోకుండా  తనకి ఏమి సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు  అలాంటిది చెర్రీ  చెల్లిని ప్రాణంగా చూసుకుంటున్నాడు కనుక  ఆమె మీద ఈగ వాలినా సహించలేని స్థితి  ఈ వయసులో అలాంటి సుగుణాలను వారిలో కలగజేయదానికి అమ్మ ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం  స్వర్గ లోకంలా ఉంటుంది.
ఆ అల్లరి కుర్రవాడి పేరు శేఖర్  చూడమ్మా శేఖర్ మీరందరూ చక్కగా ఆనందంగా ఆడుకుంటున్నారు కదా  ఆ ఆటల్లో ఎంతో హుషారుగా మీరు ప్రవర్తిస్తారు  పరిగెట్టడంలో కానీ, గెంతడంలో కానీ సైకిలు తొక్కడంలో కానీ మిగిలిన ఏ ఆటల్లోనైనా ఎంత కలివిడిగా ఉండి  సొంత కుటుంబ సభ్యులు లాగా ప్రవర్తిస్తూ  విజయం కోసం పాటు పడుతూ దాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా  అలాంటి సమయంలో  ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఆలోచించవచ్చునా?  ఇవాళ చెర్రీ చెల్లిని  నీవు కొట్టడానికి ప్రయత్నం  చేశావు  రేపు నీ చెల్లి ఆడడానికి వస్తే  ఆమెను చెర్రీ  కొట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏం చేస్తావ్  అంటే నేను ఊరుకుంటానా చెల్లిని చిన్నపిల్లను చేసి కొడతాడా  అన్నాడు ఉక్రోషంగా
దానిని ఆసరా చేసుకుని  శేఖర్  ఎవరి చెల్లి వారికి ముద్దు కదా  ఆమె కష్టపడితే ఏ అన్నయ్య భరించగలడు?  అందుకే చెర్రీ నిన్ను కొట్టబోయాడు తప్ప  మీరందరూ కూడా చక్కటి స్నేహితులే కదా  ఆ స్నేహం శాశ్వతంగా ఉండేలా చేసుకోవాలి  ప్రత్యేకించి ఈ చిన్నతనంలో ఉన్న ఈ ఆటపాటలు  మీరు చేసే కొంటి పనులు చిలిపి పనులు  జీవితాంతం గుర్తుంటాయి. మీ స్నేహం  అజరామరమవుతుంది  కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు  వారికి ఏ చెడు జరిగినా భరించే శక్తి మనకు ఉండదు  కనుక అది జ్ఞాపకం పెట్టుకుని  ప్రవర్తించండి అని చెప్పి మేముగ్గురం పైకి వెళ్లాం  నువ్వు కొంచెం ఆలస్యంగా వస్తే వాడిని టపాటపామని చెత్త చెత్తగా బాదే వాడిని అక్క  నువ్వు రావటంతో వాడు బ్రతికి పోయాడు  అన్నాడు  చెర్రీ అలా కాదు నాన్న  ఏమైనా పొరపాట్లు జరిగినప్పుడు  దానిని సరి చేసుకోవాలి తప్ప  కోపతాపాలతో విరోధం కొని తెచ్చుకోకూడదు  అని చెప్పితే అలాగే నేను ఇకముందు అలాగే ఉంటాను అంటే నాకెంతో ఆనందం వేసింది  మిగిలిన పిల్లలు కూడా  మా చెర్రీని ఆదర్శంగా తీసుకుని జీవిస్తే  అందరి జీవితాలు సుఖమయంగా ఉంటాయి  అని నేను అనుకుంటున్నాను  మరి అలా ప్రవర్తిస్తారు కదా...


కామెంట్‌లు